గజిబిజి మరియు ఉక్కిరిబిక్కిరి జీవితం ఒక్కసారిగా కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచం మొత్తం కుగ్రామం లాగా మారిపోయింది. త్వరలో మే మూడో తారీకు లాక్ డౌన్ ముగుస్తున్న తరుణంలో చాలామంది రకరకాల ప్లాన్లు వేసుకుంటున్నారు. బయట స్నేహితులను కలవడానికి కూడా టైం లేకపోవడంతో పాటు ఎక్కడికక్కడ పోలీసులు ఉండటంతో జైలు జీవితం లాగా ఈ నలభై రోజులు గడిపిన ప్రజలంతా బంధువుల ఇళ్ళకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. లవర్స్ అయితే ఏకాంతంగా గడపాలని కోరుకుంటున్నారట. మరోపక్క జాలిగా బతికిన వాళ్ళు చాలామంది స్వీగ్గీ లో టీఫిన్ ఆర్డర్ ఇవ్వాలి, పిజ్జా చెక్క ముక్కలు పెట్టాలి పిల్లలకు పెట్టాలి అని కోరుకుంటున్నారట. మరోపక్క కుటుంబ సభ్యులంతా కలిసి రెస్టారెంట్ కి వెళ్లి మంచి బిర్యానీ ఆర్డర్ ఇవ్వాలి అనే ప్లాన్స్ వేసుకుంటున్నారట. చాలావరకు స్వేచ్ఛను అనుభవించాలని అన్ని రకాల మనుషులు ప్రస్తుతం కోరుకుంటున్నారు.
కానీ ప్రభుత్వాలు మాత్రం రవాణా అదేవిధంగా రెస్టారెంట్లు మరియు షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ వంటి వాటికి అనుమతి ఇవ్వకుండా నిబంధనలు తీసుకు రాబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా లాక్ డౌన్ ఎత్తేయగానే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఫేస్ మాస్క్, సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా వ్యవహరించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. మరి ఇటువంటి సమయంలో మనమందరం ఇంటిలో వేసుకుంటున్న ప్లాన్స్ అమలు అవుతాయో లేదో చూడాలి.