ప్రస్తుతం ప్రభుత్వ శాఖలో ఉన్న ఎన్నో ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ లు విడుదల అవుతూ వస్తున్నాయి..ముఖ్యంగా రక్షణ శాఖలో ఎక్కువ నోటిఫికేషన్ లు విడుదల అవుతున్నాయి.రక్షణ శాఖలోని త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లలో చేరి దేశ సేవలో పాలు పంచుకోవాలన్న యువత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్ స్కీమ్ ను తీసుకువచ్చింది..
అగ్నిపథ్‌లో భాగంగా అగ్నివీర్ లను నియమించనుంది. ఇక రక్షణ శాఖలోని మూడు విభాగాల్లో ఒకటైన ఇండియన్ నేవీలో అగ్నివీర్ స్కీం నోటిఫికేషన్ ను విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. SSR పోస్ట్‌లకు 2800 ఖాళీలు ఉన్నాయి. ఈ నేవీ అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ పరీక్షను అక్టోబర్ 2022లో నిర్వహించబోతోంది..
పోస్టుల్లో సెలక్ట్ అయినవారు నేవీ లోని అత్యంత సాంకేతికత కలిగిన సంస్థలో భాగం అవుతారు. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు, గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్‌లు మరియు ఫ్రిగేట్‌లు, రీప్లెనిష్‌మెంట్ షిప్‌లు, అత్యంత సాంకేతిక, ఆకర్షణీయమైన జలాంతర్గాములు మరియు ఎయిర్‌క్రాఫ్ట్‌ల వంటి శక్తివంతమైన, ఆధునిక నౌకల్లో సేవలందించవలసి ఉంటుంది. రాడార్లు, సోనార్లు లేదా కమ్యూనికేషన్లు లేదా క్షిపణులు, తుపాకులు, రాకెట్ల వంటి ఆయుధాలను కాల్చడం వంటి వివిధ పరికరాల కార్యకలాపాలు చేపట్టాల్సివస్తుంది. ఈ పోస్టులకు ఎంపిక అయిన వారికి INS చిల్కాలో ప్రాథమిక శిక్షణ పొందుతారు. నేవీలోని వివిధ అవసరాలను బట్టి సేవలందించాల్సి ఉంటుంది..
పోస్టులకు సంబంధించిన కావాల్సిన అర్హతలను చూస్తే.. గుర్తింపు పొందిన విద్యా బోర్డు నుండి గణితం, భౌతికశాస్త్రం మరియు వీటిలో కనీసం ఒక సబ్జెక్ట్‌తో 10 2 పరీక్షలో అర్హత సాధించాలి. అగ్నివీర్ (SSR) అభ్యర్థుల వయస్సు నమోదు రోజున 17½ – 21 సంవత్సరాల మధ్య ఉండాలి. అగ్నివీర్ 2022 బ్యాచ్‌కు మాత్రమే.. గరిష్ట వయో పరిమితి 23 సంవత్సరాల వరకు సడలింపు ఇచ్చారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, మార్క్ షీట్‌లు, డొమిసైల్ సర్టిఫికేట్ మరియు NCC సర్టిఫికేట్ (ఉంటే) అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన ఒరిజినల్ డాక్యుమెంట్‌లను రిక్రూట్‌మెంట్ యొక్క అన్ని దశలలో చూపించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ www.joinindiannavy.gov.in నుండి కాల్ అప్ లెటర్స్ కమ్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి..
ఎంపిక ప్రక్రియ ఐదు దశలలో ఉంటుంది. 1) షార్ట్‌లిస్టింగ్ 2)ఆన్ లైన్ రాత పరీక్ష 3) ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ 4) మెడికల్ ఎగ్జామినేషన్ లలో ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇలా అన్నీ టెస్టుల్లో క్వాలిఫై అయితే.. నవంబర్ లో మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది. అభ్యర్ధికి సంబంధించిన డాక్యుమెంట్స్, అర్హతలను చూసి మొదటి రౌండ్ షార్ట్ లిస్టింగ్ పూర్తవుతుంది…ఆ తర్వాత రాత పరీక్ష ఉంటుంది.. ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన వాళ్ళు వెబ్ సైట్ ను సందర్సించి పూర్తి వివరాలను తెలుసుకోవడం మంచిది.