ఈ మున్సిపల్ కమిషనర్ మాటలు వింటే గుండె దడేల్ మంటాది?

-

రోజు రోజుకీ కరోనా వైరస్ తీవ్రత ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. మిగిలిన దేశాల్లో పాజిటివ్ కేసుల పెరుగుదల, తగ్గుదల గురించిన వార్తలు వస్తుంటే… అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం రోజు రోజుకీ పెరుగుతున్న మరణాల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారతదేశంలో కూడా రోజు రోజుకీ కరోనా ఉధృతి పెరుగుతూనే ఉంది. కాస్త ముందుగా లాక్ డౌన్ ప్రకటించబట్టి సరిపోయింది కానీ… ఏమాత్రం నిర్లక్ష్యం చేసి ఉన్నా పరిస్థితి వేరేలా ఉండేదనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పరిస్థితి ఇలానే ఉంటే.. మే 31 నాటికి సుమరు 8 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు గుజరాత్ నగర మున్సిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా. అది కూడా దేశవ్యాప్తంగా కాదు సుమా… గుజరాత్ రాజధాని అహ్మదాబా లోని ఒక జిల్లాలో!

అవును… తాజా నివేదికల ప్రకారం గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో మే 31 వ తేదీ నాటికి 8 లక్షల వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నగర మున్సిపల్ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల వేగం రోజు రోజుకీ పెరిగిపోతుందని… గత నాలుగు రోజుల్లోనే అప్పటివరకూ ఉన్న కేసుల సంఖ్య రెట్టింపు అయ్యిందని… ఈ లెక్కలు ఇలానే కొనసాగితే… మే 31 నాటికి 8లక్షల కేసులు వరకూ నమోదయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు మున్సిపల్ కమిషనర్. ఆయన ఊహించి చెప్పారో లేక ఆయన లెక్కలు ఆయను ఉన్నాయ్యో ఏమో కానీ… ఈ కామెంట్స్ తో మాత్రం కొత్త అలజడి నెలకొందని, కరోనా తీవ్రత ముందు ముందు ఎలా ఉండబొతుందో తెలుస్తుందని అంటున్నారు.

ఈ క్రమంలో… ఇప్పటివరకూ అహ్మదాబాద్ లో 1600కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… ఇది దేశంలో మూడో స్థానం. ఈ వరుసలో ముందు స్థానంలో దేశ ఆర్ధిక రాజధాని ముంబై ఉండగా.. రెండో స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news