ఒక్కొక్కరిపై రూ. 1.40 లక్షలు అప్పు ఉంది తెలుసా: ఖర్గే

-

ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలంగాణాలో అధికారంలో ఉన్న BRS పై నిప్పులు చెరిగారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ తరపున ప్రచారానికి వచ్చిన మల్లిఖార్జున ఖర్గే కేసీఆర్ పై మండిపడ్డారు. చాలా మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు కేసీఆర్ సీఎంగా వచ్చి అప్పుల రాష్ట్రంగా మార్చేసాడంటూ ఆరోపణలు చేశారు ఖర్గే. ప్రస్తుతం వివరాలను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ పాలనా చాలా బాగా చేస్తున్న అని మాయమాటలు చెబుతూ రూ. 5 .70 లక్షల కోట్ల అప్పును మిగిల్చారు అంటూ ఖర్గే విమర్శించారు. ఈ విధంగా చూస్తే ఈ అప్పు మొత్తం రాష్ట్రంలో ఉన్న ఒక్కొక్కరిపై రూ. 1 .40 లక్షల అప్పును భారంగా వేయడం జరిగింది అంటూ ప్రజలు కళ్ళు తెరిచే నిజాన్ని బయటపెట్టారు మల్లిఖార్జున ఖర్గే.

అందుకే మన రాష్ట్రము అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి కాంగ్రెస్ కు మీ విలువైన ఓటును వేసి గెలిపించండి అంటూ ఖర్గే కోరడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news