ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ విషయంలో WHOకి ఎయిమ్స్ డైరెక్టర్ సపోర్ట్ !

-

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తో కలిసి ప్రముఖ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కు పలు దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోన్న నేపదంలో దానికి WHO అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ వ్యాక్సిన్ వాడకం అనంతరం రక్తం గడ్డకట్టడం, ప్లేట్ లెట్లు పడిపోవడం వంటి దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని డెన్మార్క్, ఆస్ట్రియా, ఎస్టోనియా, లిథువేనియా, నార్వే, థాయిలాండ్, ఐస్‌లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఆరోపిస్తున్నాయి.

అంతే కాక ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగంపై ఈ దేశాలన్నీ తాత్కాలిక నిషేధం విధించాయి. తమ టీకా సురక్షితమేనని ఆస్ట్రాజెనెకా భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. దీనికి మద్దతుగా ఈ వాక్సీన్‌కు, రక్తంలో గడ్డలు ఏర్పడటానికి మధ్య సంబంధం ఉందనే దాఖలాలు ఏవీ లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO పేర్కొంది. ఈ క్రమంలో ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఆస్ట్రాజెనెకా కోవిడ్ -19 వ్యాక్సిన్ కారణంగా పెరిగిన గడ్డకట్టడానికి సంబంధించిన రెడ్ ఫ్లాగ్ ఏమీ కనిపించలేదని చెప్పారు. “ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కారణంగా  రక్తం గడ్డ కట్టే రెడ్ ఫ్లాగ్లను మేము చూడలేదు” అని డాక్టర్ గులేరియా పేర్కోన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news