థర్డ్‌ వేవ్‌ రాదు..అసలు ఆధారాలే లేవు : ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

ఇండియాలో త్వరలో థర్డ్‌ వేవ్‌ వస్తుందని అందరూ భయపడుతున్నారు. థర్డ్‌ వేవ్‌ వస్తే.. దారుణ పరిస్థితులు ఎదరు అవుతాయని అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా థర్డ్‌ వేవ్‌పై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్‌ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. థర్డ్ వేవ్‌ వస్తుందన్న ఆధారాలేవీ లేవని.. చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందని చెప్పడానికి కూడా ఆధారాలు లేవని ఆయన వెల్లడించారు. థర్డ్ వేవ్ ప్రభావం చిన్న పిల్లలపై ఉంటుందని ఇటీవల డాక్టర్లు సైంటిస్టులు అంచనా వేశారు ఈ నేపథ్యంలో చిన్న పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కూడా మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఈ క్రమంలో అందుకు భిన్నంగా చిన్న పిల్లలపై ప్రభావం ఉండబోదని వస్తుంది అని చెప్పడానికి ఆధారాలు లేవని, ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాగా గడిచిన 24గంటల్లో ఇండియాలో 84,498కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 63రోజుల తర్వాత లక్ష దిగువకి కేసులు రావడం ఇదే మొదటిసారి. అటు గత 24గంటల్లో 2123మంది కరోనా కారణంగా చివరి శ్వాస వదిలారు. దాంతో మొత్తం కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 3,51,309కి చేరింది.