ఎయిమ్స్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు… ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) లో కొన్ని పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నా వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చెయ్యచ్చు. నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) లో మొత్తం పది పోస్టులు ఖాళీ వున్నాయి.

ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అందుకే దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. న్యూరాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఈఎన్‌టీ, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు వున్నాయి.

పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్‌, ఎండీ, పీజీ లేదా తత్సమాన కోర్సు ప్యాస్ అయ్యి ఉండాలి. వయసు 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. అలానే ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే సంబంధిత విభాగంలో టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి. ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 6, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.2000లు, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.500లు కట్టాల్సి ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులు ఫీజు లేదు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కింద అడ్రెస్ కి పంపించాలి.

Executive Director, AIIMS Nagpur, Administrative Block, Plot no.2, Sector -20, MIHAN, Nagpur – 441108

 

Read more RELATED
Recommended to you

Latest news