సీఏఏ, జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)లపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో వీటిని వ్యతిరేకిస్తున్న ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. యునైటెడ్ ముస్లిం యాక్షన్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, పాషాఖాదీలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న సీఏఏ, ఎన్నార్సీని అమలు చేయవద్దంటూ సీఎం కేసీఆర్ కు లేఖ సమర్పించారు. సుమారు మూడు గంటల పాటు సీఎంతో చర్చించారు. తమ విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నట్లు అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.
మత ప్రాతిపదికనే ప్రధాని మోదీ ఎన్నార్సీ చట్టాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఎన్‌పీఎ, ఎన్‌ఆర్సీకి తేడా లేదన్నారు. దేశ వ్యాప్తంగా కలిసి వచ్చే భావసారూప్యత గల పార్టీలతో కలిసి ముందుకెళతామన్నారు. ఈనెల 27న నిజామాబాద్ లో సభ నిర్వహించనున్నట్లు అసదుద్దీన్ చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల నేతలను సభకు ఆహ్వనించనున్నట్లు తెలిపారు. జనభా లెక్కలకు NPA లెక్కలకు తేడా ఉందని జనాభా లెక్కల్లో పుట్టిన ప్రదేశం, తల్లిదండ్రుల వివరాలు అడగరని NPAలో పౌరసత్వ వివరాలు అడుగుతున్నారని ఒవైసీ చెప్పారు.