కరోనా పుణ్యమా అని మనుషుల మధ్య దూరం బాగా పెరిగింది. అంతే కాకుండా మనుషుల్లో భయం కూడా కాస్త ఎక్కువగానే పెరిగింది అనే మాట వాస్తవం. కరోనా కేసులు భారీగా ఉన్న నేపధ్యంలో మనుషుల్లో మానవత్వం కూడా పెద్దగా కనపడటం లేదు. తాజాగా ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఆన్లైన్ లో కర్మకాండలు నిర్వహించారు. భీమవరం నుంచి ఆన్లైన్లో కర్మకాండలు జరిపారు.
బెంగళూరులో 11 రోజుల క్రితం పద్మావతి అనే మహిళ చనిపోయారు. ఆమెకు ఆన్లైన్లో కర్మ కాండలను బ్రాహ్మణులు నిర్వహించారు. పద్మావతికి భర్త ,ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త, ఒక కుమారుడు బెంగళూరు, మరో కుమారుడు అమెరికాలో నివాసం ఉంటున్నారు. బెంగళూరులో కర్మకాండలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో భీమవరం నుంచి ఆన్లైన్ లోనే కర్మకాండలు చేసారు. 11వ రోజు కార్యక్రమంను బ్రాహ్మణులు నిర్వహించారు.