కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి..

-

కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీపావళి తర్వాత నుంచి ఢిల్లీ వాతారణంలో కాలుష్య తీవ్రత పెరిగింది. ప్రజలు కళ్ల మంటలు, గొంతు నొప్పులతో సతమతమవుతున్నారు. తాజాగా హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పంటను కాల్చి వేస్తుండటంతో సమస్య తీవ్రత మరింత ఎక్కువ అవుతోంది. ఢిల్లీలో ఏయిర్  క్వాలిటీ ఇండెక్స్ (AQI) 400 మించి నమోదవుతోంది. దీంతో ఢిల్లీలొ కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థతికి చేరింది. ఇందుకు తగ్గట్లుగానే ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిర్మాణ రంగ పనులను ఆపేయాల్సిందిగా ఆదేశించింది. ఇదే విధంగా కాలుష్యానికి ప్రధాన కారణమైన దుమ్మును అరికట్టేందుకు రోడ్లపై నీటిని చల్లేందుకు ఢిల్లీ ప్రభుత్వం శనివారం 114 వాటర్ ట్యాంకర్లను మోహరించింది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం యాంటీ స్మోగ్ వాటర్ ట్యాంక్‌ల సహాయంతో రోడ్లపై నీటిని చల్లుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు 92 నిర్మాణాలను నిశేధించారు. ఢిల్లీలో దీపావళి వేళ ప్రజలు విపరీతంగా టపాసులను కాల్చడంతో గాలిలో కాలుష్యం ఏర్పడింది. ఢిల్లీకి పొరుగునే ఉన్న నోయిడా, ఫరీదాబాద్, గుర్గామ్, ఘజియాబాద్ లలో తీవ్రమైన వాయు కాలుష్యం ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Latest news