కుప్పంలో హోరాహోరీ: ఆ పార్టీదే పైచేయి?

-

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపే హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మామూలుగా కుప్పంలో చంద్రబాబుకు ఎదురులేని సంగతి తెలిసిందే. వరుసగా ఏడుసార్లు కుప్పంలో చంద్రబాబు విజయం సాధించారు. అయితే ఈసారి బాబుకు చెక్ పెట్టేయాలని వైసీపీ వ్యూహాలు రచిస్తూ ముందుకెళుతుంది. ఇదే క్రమంలో స్థానిక ఎన్నికల్లో బాబుకు ఓటమి రుచి చూపించింది వైసీపీ. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…కుప్పం టార్గెట్‌గానే రాజకీయాలు చేస్తున్నారు.

chandrababu naiduఎలాగైనా బాబుని ఓడించాలనే పనిచేస్తున్న పెద్దిరెడ్డి కుప్పంలో పంచాయితీ ఎన్నికల్లో టీడీపీని చిత్తు చేశారు. ఇక ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో ఏ మాత్రం టీడీపీకి ఛాన్స్ ఇవ్వలేదు. దాదాపు 90 శాతం స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది. ఇక తాజాగా జరగనున్న కుప్పం మున్సిపాలిటీలో సత్తా చాటాలని పెద్దిరెడ్డి ఫిక్స్ అయ్యారు. ఆ దిశగానే ముందుకెళుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 25 వార్డులని కైవసం చేసుకోవాలని పెద్దిరెడ్డి చూస్తున్నారు.

కానీ ఈ సారి బాబు కూడా అలెర్ట్ అయ్యారు. పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలని కాస్త పట్టించుకోలేదు గానీ, మున్సిపాలిటీలో మాత్రం గెలవాలని డిసైడ్ అయ్యారు. ఇదే క్రమంలో ఇటీవల రెండు రోజుల పాటు కుప్పంలో తిరిగొచ్చారు. అలాగే 25 వార్డుల్లో ఆర్ధిక బలం, అంగ బలం ఉన్న అభ్యర్ధులని పెట్టారు. వైసీపీకి ధీటుగా ఉండాలనే విధంగా బాబు కూడా రాజకీయం చేస్తున్నారు.

ఇప్పటికే కుప్పంలో నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఇక ప్రచారం కూడా మొదలైంది. ఈ నెల 15న ఎన్నిక జరగనుండగా, 17న ఫలితం రానుంది. అయితే సాధారణ ఎన్నికలని తలపించేలా కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక జరగనుందని తెలుస్తోంది. ఓటర్లని ప్రలోభ పెట్టే కార్యక్రమాలు భారీగానే జరుగుతున్నాయి. అయితే వైసీపీ అధికారంలో ఉండటం…ఆర్ధిక బలం కూడా ఎక్కువగా ఉండటంతో, కుప్పం మున్సిపాలిటీలో గెలిచే అవకాశాలు వైసీపీకే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news