ఇక విమానాలు ఎక్కడం కష్టమే…?

దేశీయ విమాన ప్రయాణం మరింత ప్రియం కానుంది. విమానయాన ఛార్జీల దిగువ పరిమితిని జూన్‌ 1 నుంచి 13 – 16 శాతం పెంచుతూ పౌరవిమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఉత్తర్వుల మేరకు.. 40 నిమిషాల విమాన ప్రయాణానికి ఛార్జీల దిగువ పరిమితి రూ. 2,300 నుంచి రూ. 2,600లకు పెరుగగా, 40-60 నిమిషాల ప్రయాణానికి దిగువ పరిమితి ఛార్జీ ప్రస్తుతం రూ. 2,900 ఉండగా అది రూ. 3,300కి పెరుగుతుంది.

this flight travelled with a single passenger from singapore to chennai

60-90 నిమిషాల ప్రయాణానికి రూ.4000, 90-120 నిమిషాల ప్రయాణానికి రూ.4700 వసూలు చేస్తారు. 120-150 నిమిషాల ప్రయాణానికి రూ.6100, 180-210 నిమిషాల ప్రయాణానికి 8700 దిగువ పరిమితిగా ఉంటుంది. దీనితో ఇక విమానాలు ఎక్కాలి అనుకునే వారికి ఇది నిజంగా ఆందోళన కలిగించే అంశమే.