ఇండియాకు 500 మిలియన్ డాలర్ల సాయం చేసిన అమెరికా…!

కరోనా విషయంలో భారత్ కు అమెరికా భారీ సాయం చేసింది. అమెరికా 500 మిలియన్ డాలర్లకు పైగా సాయాన్ని భారత్‌కు అందించింది. బ్యూరో ఆఫ్ సౌత్ & సెంట్రల్ ఏషియన్ అఫైర్స్ యాక్టింగ్ అసిస్టెంట్ సెక్రటరీ డీన్ థాంప్సన్ మాట్లాడుతూ… సంక్షోభ సమయంలో భారతదేశం ఎదుర్కొంటున్న ఆటుపోట్లకు సహాయపడటానికి అమెరికా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, యుఎస్ కంపెనీలు మరియు ప్రైవేట్ పౌరులు ముందుకు వచ్చారని పేర్కొన్నారు.

వాక్సిన్ ముడి పదార్ధాన్ని భారీగా అందించామని… 20 మిలియన్ల అదనపు మోతాదుల ఆస్ట్రాజెనెకా కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి వీలు కల్పిస్తుంది అని ఆయన చెప్పారు. గత నెలలో, అధ్యక్షుడు జో బిడెన్ భారత్ కోసం అమెరికా కృషి చేస్తుందని వాక్సిన్ ల తయారీకీ అలాగే ఆక్సీజన్ సహా ఇతర పదార్ధాలను పంపడం ద్వారా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.