ఇకపై నన్ను అలా పిలవకుండి అంటున్న హీరో అజిత్..

తనును ఇకపై అలా పిలవద్దని అంటున్నాడు తమిళ స్టార్ హీరో అజిత్. ఇటీవల ’వాలిమై‘ సినిమా పొంగల్ కు రాబోతున్న సందర్భంగా అజిత్ అభిమానులు, మీడియా, ప్రజలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా తనను ’తలా‘ అని పిలవద్దని వారికి సూచించాడు. నా పేరు ముందట ఇటువంటివి వద్దని .. ఇక మీదట అజిత్, అజిత్ కుమార్, ఏకే అని సంబోధించాలని అభిమానులకు, మీడియాను కోరాడు.

తమిళ నాడులో ఇప్పుడు ఉన్న స్టార్లలో అజిత్ , విజయ్ కు మాస్ ఫాలోయింగ్ ఉంది. అజిత్ ను తలా అని, విజయ్ ను తలపతి అని అభిమానులు పిలుస్తుంటారు. ఇద్దరు హీరోలు స్నేహంగా ఉన్న వారి అభిమానులు మాత్రం ఎప్పుడూ .. గొడవ పడుతూనే ఉంటారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియా వేదికగా ఏదో ఓ రచ్చ లేపుతూనే ఉంటారు.

ప్రస్తుతం హెచ్ . వినోద్ డైరెక్షన్ లో వస్తున్న ’వాలిమై‘ సినిమాపై తమిళ నాట భారీ అంచనాలు నెలకొన్నాయి. బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా వేచిచూస్తున్నారు. పొంగల్ బరిలో ఈ సినిమా నిలవనుంది. అభిమానులకు పండగ తీసుకురాబోతోంది. ఇందులో మన తెలుగు స్టార్ కార్తికేయ విలన్ గా నటిస్తుండటం విశేషం. బైక్ రేసింగ్ ప్రధానాంశంగా ఈ సినిమా రూపొందినట్లు సమాచారం.