నందమూరి హీరో బాలకృష్ణ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. బాలయ్య, బోయ పాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా కలెక్షన్ ల పరం గా దూసుకు పోతుంది. కరోనా మహమ్మారి తర్వాత ఒక సినిమా కు ఈ రెంజ్ లో కలెక్షన్ లు రావడం ఇదే మొదటి సారి. ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ ధరలు తగ్గించినా.. తెలంగాణ లో కరోనా కారణం గా ఆంక్షలు పెట్టినా.. బాలయ్య హావా మాత్రం తగ్గలేదు. తొలి మూడు రోజులు దాదాపు అన్ని థీయేటర్స్ లలో హౌస్ ఫుల్ బోర్డు లే దర్శనం ఇస్తున్నాయి.
ఈ మూడు రోజు లలో అఖండ సినిమా కు ప్రపంచ వ్యాప్తం గా రూ. 35 కోట్ల కు పై గా వసూల్ అయ్యాయి. అలాగే కేవలం తెలుగు రాష్ట్రాలను మాత్రమే చూసినా.. రూ. 29. 50 కోట్ల కు పై గా వసూల్ చేసి బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతుంది. అలాగే అఖండ సినిమా మంచి హిట్ టాక్ రావడం తో పాటు పలువురు ఇచ్చిన రివ్యూ రేటింగ్ ల ఆధారం గా రోజు రోజు కు అఖండ ప్రేక్షకుల సంఖ్య గణనీయం గా పెరుగుతుంది.
అయితే ఏరియా పరంగా కలెక్షన్ లు చేస్తే.. నైజం లో 9.16 కోట్లు వచ్చాయి. సీడెడ్ లో చ7.78 కోట్లు, ఉత్తరాంద్ర లో 2.87 కోట్లు, వెస్ట్ లో 1.62 కోట్లు, ఈస్ట్ లో 2.04 కోట్లు గుంటూరు, కృష్ణ, నెల్లూర్ లో వరుసగా 2.71 కోట్లు, 1.66 కోట్లు, 1.41 కోట్లు వసూల్ అయ్యాయి. రెస్టాప్ ఇండియా లో 2.60 కోట్లు, ఓవర్సీస్ లో 3.55 కోట్లు వసూల్ అయ్యాయి.