మరింత బలహీనపడనున్న ’జవాద్‘ తుఫాన్… తప్పిన ముప్పు..

-

ఏపీ, ఒడిశా రాష్ట్రాలను కలవవర పెట్టిన జవాద్ తుఫాన్ మరింత బలహీన పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తుఫాను తీరం దాటుతుందని అంచానా వేసినప్పటికీ.. తుఫాన్ దిశను మార్చకుని ఉత్తరంగా ప్రయాణించి మరింత బలహీన పడింది. ప్రస్తుతం వైజాగ్‌కు తూర్పు-ఈశాన్యంగా 230 కి.మీ, గోపాల్‌పూర్‌కు నైరుతి-నైరుతి దిశలో 130 కి.మీ, పూరికి నైరుతి-నైరుతి దిశలో 180 కి.మీ మరియు పారాదీప్‌కు నైరుతి-నైరుతి దిశలో 270 కి.మీ దూరంలో కేంద్రీక్రుతం అయి ఉంది. ఇది మధ్యాహ్నం వరకు పశ్చిమ బెంగాల్ తీరం వద్ద మరింత బలహీన పడి .. అల్పపీడనంగా మారనుంది.

అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురువనున్నాయి. ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రానున్న మూడు గంటల్లో ఒడిశాలోని గంజాం, పూరీ, ఖోర్దా, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపారా, కటక్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల చిరుజల్లులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భువనేశ్వర్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news