అఖిలప్రియకు అర్ధరాత్రి వైద్య పరీక్షలు.. బెయిల్ కష్టమే !

కిడ్నాప్‌ కేసులో రిమాండ్‌లో ఉన్న అఖిలప్రియకు వైద్య పరీక్షలు చేయించారు… జైలు అధికారులు. నిన్న అర్థరాత్రి రహస్యంగా ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు జరిపించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై సోమవారం రిపోర్ట్ సమర్పించాలని కోర్టు ఆదేశించడంతో… అఖిలప్రియకు సిటీ స్కాన్, అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించారు. రిపోర్టులను సోమవారం కోర్టుకు సమర్పించనున్నారు… జైలు అధికారులు. వాటిని పరిశీలించి అఖిలప్రియ బెయిల్, కస్టడీ పిటిషన్లపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది.

ఆమె గర్భవతి, ఫీట్స్ వస్తున్నాయని అఖిల తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకుపోవడం తో వైద్య పరీక్షలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిటీ స్కాన్, అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించిన అధికారులు, రిపోర్టులో ఆమె గర్భవతి కాదని వచ్చినట్లు చెబుతున్నారు. సోమవారం ఈ రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేయనున్నారు జైలు అధికారులు. అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాలంటూ ఇప్పటికే పిటిషన్ దాఖలు అయింది. స్కానింగ్ రిపోర్ట్ లు నెగటివ్ గా రావడంతో బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది.