అఖిలప్రియ కండిషన్ సీరియస్ .. ముక్కు, నోటి నుంచి రక్తం..!

-

అఖిలప్రియ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది సికింద్రాబాద్‌ కోర్టు. సోమవారానికి విచారణ వాయిదా వేసింది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది కోర్టు. అంతకు ముందు అఖిలప్రియ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు పోలీసులు. ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. అఖిలప్రియ అనుచరులకు మరికొన్ని కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ఆమె భర్తతో సహా మిగతా నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బాధితులతో సంతకాలు చేయించుకున్న డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు.

అలాగే నిందితులను అరెస్టు చేశాక కిడ్నాప్ సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయాల్సి ఉందని..చెప్పారు. రేపటి నుంచి ఈనెల 15వరకు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు పోలీసులు.  దీనిపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. ఇక అఖిలప్రియ ఆరోగ్యంపై సికింద్రాబాద్ కోర్టులో ఆమె తరపు న్యాయవాది మెమో దాఖలు చేసారు. అఖిలప్రియ జైళ్లో కింద పడిపోయారని మెమోలో పేర్కొన్న న్యాయవాది, అఖిలప్రియ ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చిందని తెలిపారు. అఖిలప్రియను చికిత్స కోసం ఈఎన్ టీ సర్జన్ వద్దకు తరలించాలని కోరారు. అఖిల ప్రియ హెల్త్ కండీషన్ పై తక్షణమే నివేదిక అందజేయాలని జైలు వైద్యాధికారులను కోర్టు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news