ఫ్లాప్ హీరోయిన్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన బోయపాటి…!

స్టార్‌ హీరోలతో సినిమా అంటే అన్నీ వాళ్ల రేంజ్‌కి తగ్గట్లుగానే ప్లాన్ చేస్తారు దర్శకులు. కానీ బోయపాటి శ్రీను మాత్రం బాలక్రిష్ణ ప్రాజెక్ట్‌కి ఈ ఫార్మాట్‌ని పక్కనపెట్టేస్తున్నాడు. బాలయ్య జోడీగా ఫ్లాప్‌ హీరోయిన్లని పట్టుకొస్తున్నాడు. దీంతో బోయపాటి, ఎన్.బి.కె. రేంజ్‌ని తక్కువ చేస్తున్నాడని విమర్శిస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్.

బాలక్రిష్ణ సీనియర్ కేటగిరీలో చేరినా మార్కెట్‌ తగ్గకుండా చూసుకుంటున్నాడు. సాలిడ్‌ పొజిషన్‌ని మెయింటైన్‌ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు బాలయ్యతో సినిమా తీస్తోన్న బోయపాటి శ్రీను మాత్రం ఈ మార్కెట్‌కి తగ్గ హీరోయిన్స్‌ని తీసుకురాట్లేదనే విమర్శలొస్తున్నాయి. వీళ్లిద్దరి కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్‌ మూవీలో ఫ్లాప్ హీరోయిన్స్‌ని తీసుకుంటున్నారని కామెంట్‌ చేస్తున్నారు ఎన్.బి.కె.ఫ్యాన్స్.’బీబీ3′ ప్రాజెక్ట్‌కి సాయేశా సైగల్‌ని హీరోయిన్‌గా తీసుకుంటున్నారు.

అయితే ఈ సెలక్షన్‌పై బాలయ్య ఫ్యాన్స్‌ నుంచి నెగటివ్ రెస్పాన్స్‌ వస్తోంది. బోయపాటి ఏంటి ఇలాంటి హీరోయిన్‌ని తీసుకున్నాడు, బాలయ్య కటౌట్‌కి సెట్‌ అయ్యే హీరోయిన్లు ఎవరూ దొరకలేదా.. ఈ ఫ్లాప్‌ హీరోయిన్‌ని పట్టుకొచ్చాడని విమర్శిస్తున్నారు. అఖిల్‌ సినిమా ఫ్లాప్‌ అయ్యాక సాయేశాకి తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో తమిళ్‌కి వెళ్లిపోయింది సాయేశా. అయితే అక్కడా కూడా సూపర్‌ హిట్లు రాలేదు. దీంతో ఆర్యని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌ స్టార్ట్‌ చేసింది సాయేశా. ఈ ఫ్లాప్‌ హీరోయిన్‌ని బాలయ్యకి జోడీగా తీసుకొస్తున్నారని ఎన్.బి.కె.ఫ్యాన్స్‌ డిసప్పాయింట్‌ అవుతున్నారు.