ALERT : నేటి నుంచి నాలుగు రోజులు బ్యాంకులు బంద్

-

బ్యాంకు ఖాతాదారుల‌కు అలెర్ట్. నేటి నుంచి వ‌రుస‌గా నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్ ఉండ‌నున్నాయి. నేడు రెండో శ‌నివారం కాగ రేపు ఆదివారం. దీంతో ప‌బ్లిక్ హాలీడేస్ గా బ్యాంకులు మూసిఉంటాయి. అలాగే మార్చి 28, 29 తేదీల్లో ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియ‌న్లు రెండు రోజుల పాటు స‌మ్మె చేయ‌నున్నారు. దీంతో ఈ నెల 28, 29 తేదీల్లో కూడా బ్యాంకులు అన్నీ కూడా మూసి ఉంటాయి. దీంతో వ‌రుస‌గా నాలుగు రోజుల పాటు దేశ వ్యాప్తంగా బ్యాంకుల అన్నీ కూడా మూసి ఉంటాయి.

కాగ కేంద్ర ప్ర‌భుత్వం బ్యాంకుల‌ను ప్రయివేటు ప‌రం చేయాల‌నే నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తు.. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నాలుగు రోజుల త‌ర్వాత కూడా బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెలువులు ఉన్నాయి.

ఏప్రిల్ 1వ తేదీన ఇయ‌ర్లీ క్లోజింగ్.. దీంతో బ్యాంక్ ఓపెన్ చేసి ఉన్నా.. సేవ‌లు ఉండ‌వు. అలాగే ఏప్రిల్ 2వ తేదీ ఉగాది, ఏప్రిల్ 3న ఆదివారం, ఏప్రిల్ 5న బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ జ‌యంతి ఉంది. దీంతో ఆయా తేదీల్లో కూడా బ్యాంకులు మూసి ఉంటాయి. కాగ బ్యాంకు ఖాతాదారులు ఈ సెల‌వుల‌ను గ‌మ‌నించి మిగితా రోజుల్లో బ్యాంకుకు వెళ్లాలి.

Read more RELATED
Recommended to you

Latest news