బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్… జనవరి ఒకటి నుండి చార్జీల బాదుడే..!

-

మీకు బ్యాంక్ లో అకౌంట్ ఉందా..? ఏటీఎం నుండి డబ్బులని విత్‌డ్రా చేస్తూ వుంటారా..? అయితే ఈ రూల్స్ ని మీరు తప్పక తెలుసుకోవాలి. బ్యాంకులు కొత్త ఏడాది నుంచి ఏటీఎం చార్జీలను సవరిస్తున్నట్లు ప్రకటించాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

ఇప్పటికే పలు బ్యాంకులు వీటిని చెప్పాయి. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI గతంలోనే ఏటీఎం చార్జీలను పెంపొందిస్తున్నట్టు చెప్పింది. దీంతో బ్యాంకులు జనవరి 1 నుంచి చార్జీలను సవరించేందుకు సిద్ధం అవుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి బ్యాంకులు చార్జీల పెంపును తెలియజేశాయి.

ఇది ఇలా ఉంటే ఇక్కడ ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాతనే చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రతి బ్యాంక్ తన కస్టమర్లు నెలకు ఐదు సార్లు చార్జీలు లేకుండా ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకునే అవకాశాన్ని ఇస్తోంది. లిమిట్ దాటితే మాత్రం డబ్బులు చెల్లించుకోవాలి. బ్యాంక్ కస్టమర్లు తమ బ్యాంక్ ఏటీఎం ద్వారా లిమిట్ దాటిన తర్వాత డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే రూ.21 చార్జీ చెల్లించుకోవాలి.

నాన్ ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్లు ఉచితం. ఏటీఎం నుంచి కూడా మెట్రోల్లో అయితే 3 సార్లు, ఇతర పట్టణాల్లో అయితే ఐదు సార్లు చార్జీలు లేకుండా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. లిమిట్ దాటితే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు రూ.21 చార్జీ పడుతుంది. అలాగే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు రూ.8.5 చార్జీ పడుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటివి అన్నీ కూడా దాదాపు ఒకే రకమైన చార్జీలని పెట్టడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news