సీడీఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం అయింది. బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ -17 వీ5 హెలికాప్టర్ కూలిపోవడం.. అందులో ఉన్న నలుగురు అక్కడిక్కడే దుర్మరణం పాలవడంపై.. ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రధాని మోదీకి వివరాలు వెల్లడించనున్నారు. మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో ప్రస్తుతం నలుగురు అక్కడికక్కడే మరణించడంతో పాటు మిగతా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని నీలగిరి జిల్లా కలెక్టర్ వెల్లడించారు. అయితే బిపిన్ రావత్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల సమాచారం ఇంకా తెలియరావాల్సి ఉంది.
హెలికాప్టర్ ప్రమాదంపై అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఘటనపై ఇండియన్ ఏయిర్ ఫోర్స్ అత్యున్నత విచారణ కు ఆదేశించింది. మరికొద్ది సేపట్లో పార్లమెంట్ లో ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేయనున్నారు.