గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్..హాల్ టికెట్ల తేదీ ప్రకటించిన టీజీపీఎస్సీ

-

గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బిగ్ అప్డేట్ ఇచ్చింది. జూన్ 9వ తేదీన జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లను జూన్ 1వ తేదీ నుండి అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది.

అభ్యర్థులు టీజీపీఎస్‌సీ అధికారిక వెబ్ సైట్ నుండి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించింది. ప్రస్తుతం శాంపిల్ ఓఎంఆర్ షీట్లను వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచింది. జూన్ 9న ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించున్నట్లు పేర్కొంది. 563 పోస్టుల కోసం దాదాపు 4.30 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా జూన్ 9 ప్రిలిమినరీ పరీక్ష , అక్టోబర్ 21న మెయిన్స్ పరీక్ష నిర్వహించునున్నారు.

 

కాగా…గతంలో లో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ ఈరోజు సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. 2022 ఏప్రిల్ లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయము అందరికీ తెలిసిందే. అయితే పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పడితే.. మరొకసారి నిబంధనలు సరిగ్గా పాటించలేదని రెండోసారి కూడా ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేశారు.కొత్తగా 60 పోస్టులను కలిపి 563 ఉద్యోగాలకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news