దేశంలో నెమ్మదిగా కరోనా కేసులు పెరుగున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఓమిక్రాన్ కేసుల నమోదు కూడా పెరిగింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 16,764 కరోన కేసులు నమోదయ్యాయి. 7,585 రికవరీకాగా.. 220 మరణాలు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 91,361గా ఉంది. 98.36 శాతంగా రికవరీ రేటు ఉంది. గత కొన్ని రోజులుగా రోజూ వారీ కేసుల సంఖ్య 10 వేలకు లోపే ఉంటున్న క్రమంలో మళ్లీ నెమ్మదిగా దేవంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఓమిక్రాన్ కేసుల సంఖ్య వేయిని దాటింది. దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య ప్రస్తుతం 1270గా ఉంది. మహారాష్ట్రలో 450 కేసులు నమోదవ్వగా… ఢిల్లీలో 320 కేసులతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దేశంలోని 23 రాష్ట్రాలకు ఓమిక్రాన్ విస్తరించింది. ఓమిక్రాన్ నుంచి ప్రస్తుతం 374 మంది కోలుకున్నారు.
దేశంలో ఓమిక్రాన్ కేసులను పరిశీలిస్తే.. మహారాష్ట్రలో 450, ఢిల్లీలో 320, , గుజరాత్ 97, కేరళలో 109, తెలంగాణలో 62, రాజస్థాన్ 69, తమిళనాడులో 46, కర్ణాటకలోె 34, ఆంద్ర ప్రదేశ్ 16, ఒడిశా లో 14, హర్యానా 14, పశ్చిమ బెంగాల్ లో 11, మధ్య ప్రదేశ్ లో 9, ఉత్తరాఖండ్ 4 కేసులు, చండీగఢ్ 3, జమ్మూ కాశ్మీర్ లో 3, ఉత్తర్ ప్రదేశ్ లో 2, అండమాన్ నికోబార్ 02, గోవా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, లడఖ్, పంజాబ్ లలో ఒక్కో ఓమిక్రాన్ కేసు నమోదైంది.