ఇండియాపై ఆ దేశానికి ఇంత ప్రేమ ఉందా…?

తమకు ఇండియా అతి ముఖ్యమైన భాగస్వాములలో ఒకరు అంటూ యునైటెడ్ కింగ్‌డమ్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ వెల్లడించారు. కరోనా అనేది తమ సంబంధాన్ని మరింత బలోపేతం చేసే అంశం అని ఆయన చెప్పుకొచ్చారు. మే 4 న భారత ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని ఇండియా యుకె వర్చువల్ సమ్మిట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.

భారత్ కు సహాయం చేయడానికి తాము మేము చాలా వేగంగా పని చేసామని అన్నారు. ఏప్రిల్ 27 న భారత్ కు బ్రిటన్ భారీ సాయం పంపింది. అన్ని దేశాల కంటే ముందు యుకె సాయం చేసింది. ఆక్సిజన్ సాంద్రతలు, వెంటిలేటర్లను భారత్ కు పంపింది. మూడు ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లను అందిస్తామని లండన్ ప్రకటించింది. ఒక్కొక్కటి నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది.