బ్రేకింగ్: 11 గంటలకు ఈటెల మీడియా మీట్, ప్రకటన ఏంటీ…?

గత నాలుగు రోజుల నుంచి తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర ఇప్పుడు చేయబోయే ప్రకటన ఏంటీ అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఆయన నేడు ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రెస్ మీట్ లో తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే గా రాజీనామా చేసే అవకాశం ఉందని అంటున్నారు.etala-rajender

కేబినేట్ నుంచి తప్పించే ముందు ఆయన నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్ కు గవర్నర్ కేటాయించడం అది జరిగిన రెండు రోజుల్లో ఆయనను కేబినేట్ నుంచి తప్పించడం జరిగాయి. ఇక ఇప్పుడు ఈటెల ప్రకటన ఏంటీ ఆయన ఏ విషయాలు బయటపెడతారు అనే దానిపై తెరాస నేతలు అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు.