కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవలే.. మరణించిన సంగతి తెలిసిందే. జిమ్ చేస్తూ.. గుండెపోటుకు గురైన పునీత్ రాజ్ కుమార్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందారు. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదం లో కి వెళ్ళింది. ఆయన మృతి వార్తను ఇప్పటికి ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇది ఇలా ఉండగా.. పునీత్ రాజ్ కుమార్ మరణించిన తర్వాత చాలా సెలబ్రీటీలు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఇందులో భాగంగానే తాజాగా కమెడీయన్స్ అలీ, బ్రహ్మానందం పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. బెంగళూరులోని పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి… ఆయన కుటుంబ సభ్యులను పునీత్ అన్న రాఘవేంద్ర రావు రాజ్ కుమాన్ ను పరామర్శించారు అలీ, బ్రహ్మానందం. ఆయన మరణం పట్ల తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పునీత్ తో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.