గవర్నర్ తమిళిసై భద్రాద్రి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు జరిగే శ్రీరామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొననున్నారు. ఈ పర్యటన కోసం ఉదయం రైలు మార్గం ద్వారా భద్రాద్రి చేరుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం జిల్లాలోని పలు గిరిజన గ్రామాల్లో పర్యటించనున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత గవర్నర్ చేపడుతున్న మొదటి పర్యటన ఇదే. ఇటీవల ఢిల్లీలో ప్రోటోకాల్ వివాదం గురించి.. ప్రభుత్వం తమను అవమానపరుస్తున్న విధానంపై గవర్నర్ తమిళిసై అవేధన వ్యక్తం చేశారు. అయితే తాజాగా భద్రాద్రిలో కూడా ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. గవర్నర్ పర్యటనకు కలెక్టర్ అనుదీప్, ఎస్పీ సునీల్ దత్ గైర్హాజరు అయ్యారు. ఉదయం ప్రత్యేక రైలులో కొత్తగూడెం కు చేరుకున్న గవర్నర్ దంపతులను అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సింగరేణి(పా) డైరెక్టర్ బలరాం స్వాగతం పలికారు. ప్రస్తుతం గవర్నర్ భద్రాద్రి శ్రీరామ చంద్రున్ని దర్శించుకున్న తరువాత గిరిజన గూడెల్లో చేపడుతున్న పలు పోషకాహార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.