మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ కి ఆలియా.. ఎందుకంటే..?

-

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, తన సినిమాల చిత్రీకరణని మొదలు పెట్టింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గంగూ భాయ్ ఖతియావాడి చిత్ర షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. ఐతే ఈ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న ఆలియా, మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ కి రానుంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ కోసమే ఆలియా హైదరాబాద్ కి వస్తుందని తెలుస్తుంది. లాక్డౌన్ కారణంగా ఆరున్నర నెలలపాటు నిలిచిపోయిన సినిమా చిత్రీకరణ ఈ మధ్యే ప్రారంభమైన సంగతి తెలిసిందే.

కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ కూడా రిలీజ్ చేసారు. ఐతే ఆర్ ఆర్ ఆర్ లో ఆలియా పార్ట్ చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా ల మధ్య వచ్చే కీలక సన్నివేశాన్ని తెరకెక్కిస్తుండడంతో ఆలియా భట్ హైదరాబాద్ కి రానుందట. సినిమాలో కీలకంగా చెప్పుకోబడే ఈ సన్నివేశాన్ని మరికొద్ది రోజుల్లో తెరకెక్కిస్తారట.

Read more RELATED
Recommended to you

Latest news