అలియా భట్‌కు ‘టైమ్‌100 ఇంఫాక్ట్‌’ అవార్డు

-

బాలీవుడ్ ఏస్ డైరెక్టర్ మహేశ్ భట్ గా కూతురిగా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఆలియా భట్. ఫేమస్ డైరెక్టర్ కుమార్తెగా ఎంట్రీ ఇచ్చినా..వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుంది. బాలీవుడ్ లో టాప్ నటీమణుల్లో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, హాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే బ్రహ్మాస్త్ర సినిమాతో సందడి చేసింది.

ఆలియాభట్‌కు ఈ ఏడాది అన్నీ మంచి శుభాలే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘గంగూబాయి కాఠియావాడి’, ‘బ్రహ్మాస్త్ర’ ఇలా భారీ విజయాలు ఆమె ఖాతాలో పడ్డాయి. ఇటీవలే ‘టైమ్‌100ఇంఫాక్ట్‌’ పురస్కారానికి కూడా ఆమె ఎంపికైంది. ఆదివారం సింగపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా అవార్డు పొందిన ఆనందాన్ని ఇన్‌స్టాలో పంచుకుంది. పురస్కారం పట్టుకొని పరవశించి పోతున్న అలియా ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news