ప్రస్తుత రాజకీయాలు ప్రజలు అసహ్యించుకునే పరిస్థితికి వచ్చాయన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులాలు, మతాల పేరుతో ప్రజలను వేరు చేయాలని కొందరు చూస్తున్నారని ఆరోపించారు. మాతృభాషలో విద్యార్థులు ప్రాథమిక విద్య మొదలుపెట్టాలని సూచించారు.
ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలి కానీ.. ఇంగ్లీష్ సంస్కృతిని కాదన్నారు. ఎడ్యుకేషన్ ఒక మిషన్.. కమిషన్ కాకూడదన్నారు. యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వెంకయ్య నాయుడు సూచించారు. కృషి, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అన్నారు. యువత రాజకీయాలలోకి రావాలని, బుల్లెట్ కన్నా బ్యాలెట్ శక్తివంతమైనదని అన్నారు. ఇష్టమైన పనిలో కష్టపడితే నష్టం లేదన్నారు. టెక్నాలజీలో భారత్ ముందుకు వెళుతుందన్న వెంకయ్య.. రాబోయే రోజుల్లో 4వ అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుందన్నారు.