అందరినీ టెన్షన్ పెడుతున్న ప్రభాస్ ఆదిపురుష్..!!

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ”ఆదిపురుష్”. ఇది వచ్చే సంక్రాంతి కానుక గా రిలీజ్ కానుంది.  ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు వున్నాయి  ప్రమోషన్స్ లో భాగంగా గతంలో రిలీజ్ చేసిన టీజర్లో గ్రాఫిక్స్ బాగా లేవని సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. అదే సమయంలో కొంత మంది  హిందూ దేవుళ్లను కించ పరిచేలా వుందని  కామెంట్స్ చేసారు.

దీనితో ఆదిపురుష్ టీజర్‌కు వస్తోన్న నెగిటివ్ కామెంట్స్ పై దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను మేము చాలా ఇష్టపడి  తీశామని సినిమాపై తాను పూర్తి నమ్మకంతో ఉన్నట్లు తెలిపాడు. తర్వాత రిలీజ్ అయిన త్రీడీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో మేకర్స్ కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. గ్రాఫిక్స్ నాసిరకం అనే కామెంట్స్ రాకుండా దర్శకుడు ఓం రౌత్ గ్రాఫిక్ వర్క్ మొత్తం దగ్గరుండి చూసుకుంటూ బాగా బిజీ గా వున్నాడు.

ప్రస్తుతం భారీ చిత్రం గ్రాఫిక్ వర్క్ పూర్తి కాక సినిమాను వాయిదా వేస్తారు అనే ప్రచారం భారీ స్థాయిలో జరుగుతోంది. ఈ సినిమా సంక్రాంతి పండుగ రేసు నుంచి తప్పుకుంటే అఖిల్ అక్కినేని తో పాటు మరికొన్ని చిన్న సినిమాల హీరోలు బరిలోకి దిగాలని చూస్తున్నారు. కాని ఆదిపురుష్ సినిమా మేకర్స్ ఏమి తేల్చడం లేదు. ఈ విషయం సంక్రాంతి రేసులో ఉన్న సినిమా నిర్మాతలను ఉత్కంఠకు గురి చేస్తోంది. దీనిపైక్లారిటీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news