అమరావతి-ఈనాడు-పవన్..బాబు సేఫ్?

-

రాజకీయాల్లో సపోర్ట్ అనేది నాయకులకు చాలా హెల్ప్ అవుతుంది..ప్రత్యర్ధులపై పోరాటం చేసేటప్పుడు..ఇతర పార్టీలు, మీడియా సంస్థలు, న్యూట్రల్ వర్గాలు సపోర్ట్ చేయడం వల్ల బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అలాగే ప్లస్ అయ్యేలా ఉంది. జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ..వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి రావాలని చూస్తున్న బాబుకు..పలు రకాలుగా మద్ధతు లభిస్తుంది.

రాష్ట్రంలో ఇతర పార్టీలైన జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌లు..జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం వల్ల..పరోక్షంగా అది టీడీపీకి ప్లస్ అవుతుంది. అలాగే న్యూట్రల్‌గా ఉండే వ్యక్తులు సైతం జగన్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా టీడీపీకి ప్లస్సే. అయితే గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉండగా, బాబుపై పోరాటం చేసే విషయంలో అన్నిరకాలుగా మద్ధతు దొరికింది. దీని వల్ల జగన్‌కు 2019 ఎన్నికల్లో బాగా ప్లస్ అయింది. ఎప్పుడైనా ప్రతిపక్ష నేతలు..అధికార పార్టీపై విమరాలు చేయడం వలన, వాటిని పూర్తిగా నమ్మే పరిస్తితి ఉండదు.

అదే సమయంలో ఇతర పార్టీలు, పలు మీడియా సంస్థలు, న్యూట్రల్ వర్గాలు కూడా అధికార పార్టీని టార్గెట్ చేస్తే ఆటోమేటిక్‌గా ప్రతిపక్షానికి లబ్ది చేకూరుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రస్తుతం ఏపీలో మూడు అంశాలు బాబుకు బాగా ప్లస్ అవుతున్నాయి. అమరావతి రైతుల ఉద్యమం, పాదయాత్ర టీడీపీకి బాగా ప్లస్.

తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1గా ఉన్న మీడియా సంస్థ ఈనాడు..ఇటీవల కాలంలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంది. వైసీపీ నేతల భూ అక్రమాలు అంటూ ఆధారాలతో సహ ఈనాడు పత్రికలో కథనాలు వస్తున్నాయి. ఇవి వైసీపీకి మైనస్ అవుతాయి..అలాగే పరోక్షంగా టీడీపీకి ప్లస్ అవుతుంది. ఇక బాబుకు వచ్చే మరో ప్లస్ పవన్ రూపంలో రానుంది. పవన్ సైతం జగన్ ప్రభుత్వంపై గట్టిగా పోరాడుతున్నారు. దీంతో పవన్ బలం కూడా పెరుగుతుంది. కానీ పవన్‌కు సింగిల్ గెలిచే సత్తా ఇప్పుడు లేదు. కాబట్టి పవన్-బాబుతో కలిసి ఇంకా జగన్‌కు రిస్క్. ఇలా అమరావతి-ఈనాడు-పవన్ ద్వారా బాబుకు ప్లస్ అయ్యేలా ఉంది.

ReplyForward

Read more RELATED
Recommended to you

Latest news