ఆసక్తి ఉంటే చాలు.. ఎటువంటి విద్యార్హతతో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లో ఉచితంగా వీడియో పాఠాలు నేర్చుకోవచ్చు. వివిధ అంశాలపై పట్టు సాధించవచ్చు. వీటిలో ప్రవేశానికి నేషనల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాలజీ ఎన్‌హ్యాన్స్‌డ్ లర్నింగ్ (ఎన్‌పీటీఈఎల్) రిజిస్ట్రేషన్లకు ఆహ్వానం పలుకుతోంది.
చదువుతున్న కోర్సుల్లో మరింత పరిజ్ఞానానికీ, కొత్త సబ్జెక్టుల్లో ప్రావీణ్యానికీ ఈ వీడియో పాఠాలు ఉపయోగపడతాయని నిపుణులు చెప్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు, నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని ఆశించేవారికి ఇవి ఎంతో ఉపయుక్తం. వీటిలో కొన్ని కోర్సులకు సర్టిఫికెట్ పొందే అవకాశమూ ఉందండోయ్.