ఏపీలో పాల రాజకీయం.. టీడీపీ ప్యూహం ఫలిస్తుందా

-

ఏపీలో పాల రాజకీయం రాజుకుంటోంది. ప్రభుత్వం చేపట్టిన ఏపీ-అమూల్ మిల్క్ ప్రాజెక్టుపై టీడీపీ గుర్రుగా ఉంది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్, ఇతర టీడీపీ నేతల నిర్వహణలో ఉన్న కొన్ని డెయిరీలను టార్గెట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నది ప్రతిపక్ష ఆరోపణ. అమూల్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని సహకార డెయిరీలను ఏకతాటి మీదకు తెచ్చేందుకు ప్రణాళికలు సిద్దం అవుతున్నట్టు కన్పిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో అమూల్‌ ప్రాజెక్టు చుట్టూ రాజకీయం తిరుగుతోంది. అమూల్ ప్రాజెక్టును లాంఛ్‌ చేయడం ద్వారా పాడి రైతులకు లబ్ది కలిగిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఆమూల్ రాకతో లీటర్ కు ప్రైవేట్ డెయిరీలు ఇస్తున్న మొత్తానికి అదనంగా 5 రూపాయల నుంచి పది రూపాయలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. దీని కోసం తొలి దశలో చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో పాల సేకరణ ప్రారంభించింది కూడా. దశల వారీగా రాష్ట్రం మొత్తం ఏపీ – ఆమూల్ ప్రాజెక్టును విస్తరిస్తారు.

9,899 గ్రామాల్లో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ఆటమేటిక్ పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. వీటికి ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తోంది. దీన్ని ప్రతిపక్షాలతోపాటు ప్రైవేటు డెయిరీలు తప్పుబడుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో వివిధ డెయిరీల సేకరిస్తున్న పాలు, పాడి రైతుల సొంత వినియోగం కూడా అయిపోయాక సుమారు రెండు కోట్ల లీటర్లకు పైగా పాలు మార్కెట్‌ సర్‌ప్లస్‌ ఉందన్నది ప్రభుత్వ లెక్క. మార్కెట్‌లో సర్‌ప్లస్సుగా ఉన్న పాల సేకరణ పైనే దృష్టి సారిస్తామని అంటోంది. అలాగే అమూల్ ప్రాజెక్టు వల్ల పాల మార్కెట్టులో పోటీ వాతావరణ పెరిగి పాడి రైతులకు లాభం కలుగుతుందనేది ప్రభుత్వ వాదన.

అయితే ఇదంతా ప్రభుత్వం చెబుతున్న కట్టుకథ మాత్రమేననేది సహకార, ప్రైవేటు డెయిరీల వాదన. గుజరాత్ లో ఆమూల్ ఇచ్చే పాల సేకరణ ధరకు ఏపీలో ఇస్తున్న ధరకు బోలెడు వ్యత్యాసం ఉండటమే అందుకు ఉదాహరణ అని చెబుతున్నారు. మరోవైపు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ మొత్తం వ్యవహరం నడుస్తోందనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా హెరిటేజ్‌, సంగం వంటి డెయిరీలను టార్గెట్‌ చేసుకుంటూ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసుకుంటోందనే భావన వ్యక్తమవుతోంది. ఇప్పటికే జగన్‌ ప్రభుత్వం సంగం వంటి డెయిరీలను లక్ష్యంగా చేసుకుని వివిధ కేసులు పెట్టడానికి సిద్దమవుతోన్నట్టు సమాచారం.

ఈ మేరకు సంగం డెయిరీ కూడా దానికి అన్ని రకాలుగా సిద్దమై ఉన్నట్లు తెలుస్తుంది. ఫెడరేషన్‌ నుంచి మాక్స్‌ చట్టానికి మారినా.. మాక్స్‌ నుంచి ప్రొడ్యూసర్స్‌ కంపెనీకి మారిన అంతా పక్కా నిబంధనల ప్రకారం.. పాడి రైతుల అంగీకారంతోనే చేపట్టామని స్పష్టం చేస్తున్నారు. మొత్తంమీద ప్రభుత్వం రైతుల సంక్షేమం అంటుంటే… ప్రతిపక్షం తమను టార్గెట్ చేయడానికే ఈ పథకం అంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news