ఒక్క క్లిక్ తో అన్ని ఫటాఫట్.. !!

-

మనం ఎదో ఒక వెబ్సైటు ను ఓపెన్ చేస్తే మనకి కావలిసింది రాకపోగా మరేదో వెబ్సైట్ ఓపెన్ అవుతూ ఉంటుంది.అక్కడితో ఆగితే పర్వాలేదు. అది కాస్తా ఓపెన్ చేస్తే ఆ ఆప్స్ మన ఫోన్ లోకి డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి. అలాంటి వాటి వలన మన ఫోన్ కు, మనకు ప్రమాదం అని తెలిసిందే. అయితే ఒక్క క్లిక్కుతో మనం ఫోన్లో ఉన్న డేటా మొత్తం వారి చేతుల్లో పెట్టిన వాళ్ళం అవుతాము.ఇలా ఇప్పటికే ఎంతోమంది ఇలాంటి ఫేక్ ఆప్స్ బారినపడి ఫోన్లో ఉన్న పర్సనల్ డేటా మొత్తం కోల్పోయారు.అయితే తాజాగా ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ ఆవెర్నెస్ సోషల్ మీడియాలో స్మార్ట్ ఫోన్ వాడేవారు URLS నుంచి వచ్చే ఆక్సీమీటర్ అప్స్ ను డౌన్లోడ్ చేసుకోవద్దని హెచ్చరికలు జారీ చేసింది. కరోనా దేశంలో విజ్రింభిస్తున్న వేళ ప్రజలు అందరు ఆరోగ్యం మీద దృష్టి పెడుతున్నారు. ఇది అదునుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ లో రెచ్చిపోతున్నారు. ఎదో ఒక అప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఆక్సీమీటర్ చెక్ చేసుకునే అప్ కనిపిస్తుంది. ఈ అప్ లో మనుషుల శరీరంలో ఆక్సీజన్ ఎంత ఉందో చెక్ చేసి చెప్తుందని డౌన్లోడ్ చేసుకోమని సూచిస్తుంది. అది కనక డౌన్లోడ్ చేసుకుంటే ఫోన్లో ఉన్న మొత్తం డేటా సైబర్ నేరగాళ్ల చేతిలో పెట్టినట్లే అని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తుంది.ఒకవేళ మీకు ఎటువంటి అనారోగ్యం ఉన్నగాని ఆసుపత్రిలో చెక్ చేసుకుంటే మీకు ఎటువంటి భయం అనేది ఉండదు. మెస్సేజెస్ రూపంలో గాని, కాల్స్ రూపంలో గాని వచ్చే అప్స్ అసలు డౌన్లోడ్ చేసుకోవద్దు..

Read more RELATED
Recommended to you

Latest news