ఇళ్ల స్థలాలలో ఇన్ని అక్రమాల.. జగన్‌ను అప్రతిష్టపాలు చేస్తున్న నాయకులు.. ?

-

ఏపీలో ఇళ్ల స్థలాల వ్యవహారం మరింత రంజుగా మారబోతోందట.. దీనికంతటికి కారణం అవినీతి పనులే అని అంటున్నారు.. అక్రమ మట్టి రవాణాతో పాటుగా, కొందరు స్థానిక నేతలు హీరోయిజం ప్రదర్శించి మరీ పార్టీ పరువును గంగపాలు చేసి ఎమ్మెల్యేలను ఇరకాటంలోకి నెట్టారట. వీరు చేసే పనుల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట మంట కలిసేలా ఉందని, ఇలాంటి అవినీతి వ్యవహారంలో కొందరు ప్రత్యేకపాత్ర పోషిస్తున్నట్టు చెబుతున్నారు అధికారులు..

ఇకపోతే జిల్లాలో ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య లక్షా 65 వేలకు పైగా ఉండగా, ఇందులో అర్హులైన వారి జాబితాలకు తుదిరూపు ఇస్తున్న క్రమంలో కొందరు నేతలు నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం పలు నియోజకవర్గాల్లో కనిపిస్తుందట. ఇక పేదలకు పంచవలసిన స్దలాలను ఇప్పటికే రూ.1000 కోట్లకు పైగా వెచ్చించి ప్రైవేట్‌ వ్యక్తుల నుండి సేకరించగలిగారు. కానీ ఆలోపే దీనిలో ముట్టాల్సిన వాటాలన్నీ కొందరి జేబుల్లోకి చేరినట్టు ఆరోపణలు వచ్చాయట.

 

ఇక కొన్ని నియోజకవర్గాల్లో అయితే పూర్తిస్థాయి ఆధిపత్యం తమవైపే ఉండాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారని సమాచారం.. ఇకపోతే ప్రస్తుతం వరకు ఇళ్ల స్థలాల వ్యవహారంలో, స్థల సేకరణ, నిర్ధారణలో ఎమ్మెల్యేలదే ఆధిపత్యంగా ఉండేది.. కానీ అనేకచోట్ల వచ్చిన ఆరోపణలతో తొలి జాబితా విడుదల, స్థలాల అప్పగింత విషయంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఎవరి జోక్యం లేకుండా చూసేందుకు ప్రత్యేకాధికారులు రంగంలోకి దిగబోతున్నారు. అంతే కాకుండా ఒకటి, రెండు రోజుల్లో ఇంటి స్థలాల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లిన తరువాత కీలక నిర్ణయం వెలువడుతుందంటూ ఇన్‌చార్జ్‌ మంత్రి పేర్ని నాని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే..

Read more RELATED
Recommended to you

Latest news