అరచేతిలో వైకుంఠం చూపించి.. మనల్ని మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు.రైతులను, యువకులను.. అందర్నీ కాంగ్రెస్ పార్టీ వంచించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చిందని.. ఒక్క ఉచిత బస్సు మినహా ఏది కూడా నెరవేర్చలేదని అన్నారు .
కేసీఆర్ బస్సు యాత్రలో భాగంగా మెదక్ పార్లమెంటు పరిధిలోని నర్సాపూర్ చేరుకుంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. 5 నెలల్లోనే రాష్ట్రం ఇంత ఆగమాగం ఎందుకయ్యిందని ప్రశ్నించారు.రైతుబంధు కూడా రేపు రేపు వ్యవసాయం చేసినోళ్లకే ఇస్తారంట.. పొలం దున్నినోళ్లకే ఇస్తారంట అని అన్నారు.తల, తోక లేకుండా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా తెలంగాణను నష్టపరుస్తుందని, కరెంటు కోతల కారణంగా హైదరాబాద్లో పరిశ్రమలు వెళ్లిపోయే, ఐటీ దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు.