IPL 2024 : ముగిసిన లక్నో ఇన్నింగ్స్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే?

-

ఐపీఎల్-2024 ఎడిషన్లో భాగంగా ఇవాళ హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జాయింట్స్ తలపడుతున్నాయి .ముందుగా టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో సన్ రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో లక్నో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

మొదటగా బ్యాటింగ్ దిగిన ఓపెనర్లు క్వింటన్ డీకాక్, కేఎల్ రాహుల్ దారుణంగా విఫలయ్యారు. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో డికాక్ కేవలం 2 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు కేఎల్ రాహుల్ 23 బంతుల్లో 29 రన్స్ చేసిన ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన క్రునాల్ పాండ్యా 21 బంతుల్లో 24 పరుగులు చేసి కమిన్స్ వేసిన చక్కటి త్రో వల్ల రన్ అవుట్ అయ్యాడు. బదోని(55), పూరన్ (48) పరుగులతో రాణించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 2, కమిన్స్ ఒక వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news