ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ పై ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయినా జగన్ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కొనసాగించేదుకు సంసిద్ధంగా లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘ముఖ్యమంత్రి గారు.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గారిని కొనసాగించే ప్రక్రియలో మీరు భేషజాలకు పోకండి. ఇగో ప్రక్కన పెట్టండి. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. రాజ్యాంగాన్ని రక్షించండి. రాజకీయ నిర్ణయాలను సమీక్షించడానికే న్యాయవ్యవస్థ. అర్థమవుతుందా?’ అంటూ వర్ల రామయ్య మండిపడ్డారు. అయితే రాష్ట్ర హై కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి గారు! నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గారిని కొనసాగించే ప్రక్రియలో మీరు భేషజాలకు పోకండి."ఇగో" ప్రక్కన పెట్టండి.దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించండి.ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.రాజ్యాంగాన్ని రక్షించండి.రాజకీయ నిర్ణయాలను సమీక్షించడానికే న్యాయవ్యవస్థ. అర్ధమవుతుందా?
— Varla Ramaiah (@VarlaRamaiah) June 11, 2020