నేడు అఖిల పక్ష సమావేశం..హాజరుకానున్న ప్రధాని మోడీ

-

నేడు అఖిల పక్ష సమావేశం కానుంది. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలోనే.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అఖిలపక్ష సమావేశం జరుగనుంది. ఇక ఈ అఖిల పక్ష సమావేశానికి హాజరు కానున్నారు ప్రధాని మోడీ. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరుగనుంది. పార్లమెంట్‌ విషయాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. కాగా..

మొత్తం 29 సిట్టింగు లతో ( పనిదినాలు) రెండు విడతలుగా ఈ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. మొదటి విడతలో ( జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వర కు) 10 సిట్టింగులు ( పని దినాలు) కాగా.. రెండవ విడతలో ( మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు) 19 సిట్టింగులు ( పనిదినాలు) జరుగనున్నాయి. ప్రతిరోజు ప్రతిసభ 5 గంటల పాటు సమావేశం జరుగనుంది. మొదటి రెండు రోజులు మిన హాయిస్తే—-తొలిరోజు రాష్ట్రపతి ప్రసంగం, మరుసటి రోజు ఆర్దిక మంత్రి బడ్జెట్ ప్రసంగం—- వాస్తవంగా జరిగే సిట్టింగులు 27 ఉండనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news