లవంగాలు ఘాటుగా ఉంటాయి. ఎన్నో ఆహారపదార్థాలలో మనం వాడుతూ ఉంటాము. బిర్యానీ వంటి వాటిలో లవంగాలు ఉపయోగిస్తే మంచి ఫ్లేవర్ ను ఇస్తాయి. అయితే లవంగాల వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. లవంగాలతో టీ చేసుకుని తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మరి లవంగాల టీ వల్ల ఎలాంటి లాభాలు పొందొచ్చు..?, ఏ సమస్యల నుంచి బయట పడవచ్చు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తి చూసేయండి.
లవంగాల లో వేడి గుణం ఉంటుంది. చలికాలంలో లవంగాలను తీసుకోవడంవల్ల ఒంట్లో వేడిగా ఉంటుంది.
అలాగే బర్నింగ్ సెన్సేషన్, దగ్గు, జలుబు వంటి సమస్యలు తొలగిపోతాయి.
లవంగాలు టీ తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.
రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది చక్కటి పరిష్కారం చూపిస్తుంది.
జీర్ణ సమస్యలు తొలగించి డైజెస్టివ్ సిస్టం ని ఇంప్రెస్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.
అలానే పంటి సమస్యలని కూడా లవంగాలు తొలగిస్తుంది. ఈ టీ వల్ల దంత సమస్యలు వుండవు.
నోట్లో ఉండే బ్యాక్టీరియాను కూడా ఇది తొలగిస్తుంది.
ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యల్ని కూడా లవంగాల టీ తొలగిస్తుంది.
లవంగాల టీ ని ఎలా తయారు చేసుకోవాలి..?
ఇప్పుడు లవంగాల టీ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా అరకప్పు నీళ్ళల్లో రెండు లవంగాలు వేసి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత సగం అయ్యే వరకు కూడా మరిగించాలి. ఆ తరవాత స్టవ్ కట్టేసి ఒక చెంచా తేనె వేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఉదయం పూట తీసుకుంటే మంచిది.