వాస్తు: ఓటమి లేకుండా ఉండాలంటే ఇంట్లో తక్షణమే ఈ మార్పులు చెయ్యండి..!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులని అయినా తొలగించుకోవచ్చు. మనకు తరచూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అయితే ఆ సమస్య నుండి బయట పడాలంటే కచ్చితంగా వాస్తుని అనుసరించాలి. అయితే మరి ఆ అద్భుతమైన వాస్తు చిట్కాలు గురించి ఇప్పుడు చూద్దాం. ఇంటి అందాన్ని ఫర్నిచర్ మరింత పెంపొందిస్తుంది.

అయితే అందంతో పాటు వాస్తు ప్రకారం నడుచుకోవడం కూడా ముఖ్యం. ఫర్నిచర్ ని వాస్తు ప్రకారం ఎలా పెట్టాలి అనే దాని గురించి ఈ రోజు చూద్దాం. ఫర్నిచర్ ని తయారు చేసే చెక్క విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. రోజ్ వుడ్, శాండిల్ వుడ్, అశోక, టేక్, వేప వంటి వాటి నుండి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఆ వుడ్ తో తయారు చేసిన ఫర్నీచర్ ను ఉపయోగించడం మంచిది.

అదే విధంగా మీరు ఫర్నిచర్ కొనేటప్పుడు మంగళవారం, శనివారం లేదా అమావాస్య నాడు కొంటే చాలా మంచిది. అలానే చెక్క ఫర్నిచర్ పెట్టుకునేటప్పుడు దక్షిణం లేదా పడమర వైపు పెడితే మంచిది. ఫర్నిచర్ మీద రాధా కృష్ణుడు, పువ్వులు, సూర్యుడు, నెమలి, గుర్రం, ఏనుగు, చేప వంటివి ఉంటే మంచిది వీటి వల్ల నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఇంట్లో అనుసరిస్తే తప్పక మంచి కలుగుతుంది. అలాగే ఏ ఇబ్బందులు లేకుండా మీరు ఉండొచ్చు. ఓటమి లేకుండా సక్సెస్ ని అందుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news