ఇది కేసీఆర్ స్టైల్, ఎవరైనా మెచ్చుకోవాల్సిందే…!

-

అమ్మో కరోనా వస్తుంది… ఇది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భయం. పాలకులు ఇప్పుడు ప్రజల్లో ఉన్న ఆ భయాన్ని పోగొట్టే విధంగా ప్రయత్నాలు చెయ్యాలి. అది ఎవరైనా ఎక్కడి వారు అయినా సరే. ప్రజల్లో ఒక్కసారి భయం మొదలయింది అంటే ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కొంత మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకడుగు వేసే పరిస్థితి ఉండదు. దీన్ని గమనించిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం మార్చారు.

మన రాష్ట్రంలో వచ్చే నెల 7 తర్వాత కరోనా అనేది ఉండదు, మీడియా అనవసరంగా సీన్ చేయవద్దు అని కెసిఆర్ ప్రకటించారు. వచ్చే నెల 7 తర్వాత తెలంగాణా కరోనా ఫ్రీ రాష్ట్రంగా మారుతుంది అని ఆయన ధీమా వ్యక్తం చేసారు. అదే విధంగా కరోనా ఎవరికి రాదు అని ఆయన ధైర్యం చెప్తున్నారు. ఎవరూ కూడా భయపడవద్దు అంటూ కరోనా కట్టడికి చెయ్యాల్సినవి చేస్తున్నారు. రైతుల గురించి ఆయన చెప్పిన మాటలు మాత్రం నిజంగా అభినంధించేవి

అనవసరంగా గత్తర పడి ఒకరి మీద ఒకరు పడకుండా ధాన్యం అమ్ముకోవాలని సూచించారు. ఆయన సీరియస్ గా చెప్పినా ఎలా చెప్పినా సరే ప్రజల్లోకి ఆయన ఎం చెప్పాలి అనుకున్నారో… ప్రజలకు ఏది కావాలో అది స్పష్టంగా అర్ధమవుతుంది. ఇంట్లో మనిషి ధైర్యం చెప్పినట్టు చెప్తున్నారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, కెసిఆర్ ఇప్పుడు ముందు వరుసలో ఉన్నారు. చాలా మంది ముఖ్యమంత్రులు మీడియా సమావేశాలు నిర్వహించాలి అంటే భయపడుతున్నా కెసిఆర్ మాత్రం భయపడటం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news