భారీగా తగ్గుతున్న బంగారం…!

-

గత వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర రెండు రోజుల నుంచి తగ్గడం మొదలుపెట్టింది. అది కూడా భారీగా తగ్గుతూ వస్తుంది. పెరిగినట్టే పెరిగిన బంగారం ఇప్పుడు తగ్గిపోవడం చూసి షాక్ అవుతున్నారు. డిమాండ్ లేకపోవడం, కొనుగోలు లేకపోవడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్ లో మంగళవారం బంగారం ధర 300కి పైగా తగ్గింది. బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు 320 రూపాయల తగ్గింది.

దీనితో 39,520 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే పది గ్రాములకు 210 రూపాయల తగ్గడంతో… 43,175 రూపాయలు తగ్గింది. విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం 320 రూపాయల తగ్గి 39,520 రూపాయలుగా నిలిచింది. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 210 రూపాయల వరకు తగ్గింది. దీనితో 43,175 రూపాయలకు చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 420 రూపాయల తగ్గి… 43,300 రూపాయల వద్దకు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయల తగ్గడంతో… 41,020 రూపాయలకు చేరుకుంది. వెండి ధర కూడా క్రమంగా తగ్గుతుంది. రాబోయే రెండు మూడు రోజుల్లో మరింతగా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news