Kakani Govardhan Reddy: మాజీ మంత్రి, వైసిపి నేత కాకాని గోవర్ధన్ కు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మైనింగ్ కేసులో అడిషనల్ సెక్షన్ల కింద ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయిందని వార్తలు వస్తున్నాయి. రుస్తుం వైన్స్ లో పేలుడు పదార్థాలు… గిరిజనులు నిలదీయడం జరిగిందని సమాచారం. ఈ తరుణంలోనే ఆ గిరిజనులను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ అనుచరులు బెదిరించారని అభియోగాలు వస్తున్నాయి.

దింతో మాజీ మంత్రి కాకాణిపై మరో కేసు నమోదు అయింది.. కాకాణిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు.. కాకాణికి స్వయంగా నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు పోలీసులు.. ఈరోజు సాయంత్రం లేదా రేపు నెల్లూరుకు చేరుకోనున్నారు కాకాణి..