ఇప్పుడున్న టాలీవుడ్ డైరెక్టర్లలో పెద్ద డైరెక్టర్లు ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేర్లు రాజమౌళి గుర్తొస్తాడు. మరి ఈయన ఎవరి దగ్గర శిష్యుడిగా చేశాడో తెలుసా. దిగ్గజ డైరెక్టర్ కే.రాఘవేంద్రరావు దగ్గర. ఈయనే కాదు చాలా మంది డైరెక్టర్లు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసి ఇప్పుడు పెద్ద డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు.
రాజమౌళితో పాటు కోదండరామిరెడ్డి, వైవిఎస్ చౌదరి, జయంత్ సి.పరాన్జి, బి.గోపాల్ లాంటి యాక్షన్ డైరెక్టర్లు రాఘవేంద్రరావు దగ్గర ఓనమాలు దిద్దినవారే. వీరంతా రాఘవేంద్రరావు స్కూల్‌లోనే మెగాఫోన్ పట్టుకోవడం నేర్చుకున్నారు.
ఇక రాజమౌళి ఇప్పుడ ఇండియాలోనే అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు రాఘవేంద్రరావు అంటే సౌత్ ఇండస్ట్రీలోనే అత్యంత ఫేమస్. ఆయన కోసం అన్ని భాషల హీరోలు ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. మరి ఆ దిగ్గజ దర్శకుడి ఇచ్చిన ఈ డైరెక్టర్లే నేడు టాలీవుడ్ ఖ్యాతిని పెంచుతున్నారు. ఎంతైనా రాఘవేంద్రరావు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మూల స్థంభం అనే చెప్పాలి.