కంపెనీలు ఉద్యోగుల‌కే టీకాల‌ను ఇవ్వాలి, వారి కుటుంబ స‌భ్యుల‌కు కాదు..!

-

దేశంలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్యాల‌యాల్లో ఆయా సంస్థ‌లు నిర్వ‌హించే టీకా పంపిణీ కార్య‌క్రమాన్ని కేవ‌లం సంస్థ‌ల‌కు చెందిన ఉద్యోగుల‌కు మాత్ర‌మే పరిమితం చేయాల‌ని, వారి కుటుంబ స‌భ్యులు, బంధువుల‌కు టీకాల‌ను వేయ‌కూడ‌ద‌ని కేంద్ర ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలోనే ఉద్యోగుల‌కు చెందిన కుటుంబ స‌భ్యులు ఈ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోకుండా నిరోధించాల‌ని తెలిపింది.

companies have to give vaccine for their employees only not kin

కంపెనీలు, ప‌రిశ్ర‌మ‌ల్లో ఉద్యోగుల‌కు చెందిన కుటుంబ స‌భ్యుల‌కు టీకాల‌ను వేయ‌కూడ‌ద‌ని, కేవ‌లం ఉద్యోగుల‌కు మాత్ర‌మే టీకా పంపిణీని పరిమితం చేయాల‌ని కేంద్ర ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ రాష్ట్రాల‌కు సైతం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాల‌కు స్ప‌ష్ట‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను సూచించింది.

అయితే కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశాలు ఉన్న‌ప్ప‌టికీ ఆ వివ‌రాలు త‌మ‌కు తెలియ‌వ‌ని, కంపెనీలు, ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన యాజ‌మాన్యాలు చెబుతున్నాయి. దీంతో గంద‌రగోళ ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే కంపెనీలు, ప‌రిశ్ర‌మ‌ల నుంచి ప్ర‌భుత్వాలు వివ‌ర‌ణ కోరుతున్నాయి. అయితే ఉద్యోగుల‌కు చెందిన కుటుంబ స‌భ్యుల‌కు టీకాల‌ను పంపిణీ చేసేందుకు అనుమ‌తులు ఇచ్చినా ప్ర‌స్తుతం 18 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి టీకాల‌ను ఇచ్చేందుకు టీకాల కొర‌త ఉంది క‌నుక ఆ కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగించ‌డం అసాధ్య‌మ‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఉద్యోగుల కుటంబ స‌భ్యుల‌కు టీకాల‌ను ఇచ్చినట్ల‌యితే టీకాల‌కు మ‌రింత కొర‌త ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అభిప్రాయ‌ప‌డింది.

Read more RELATED
Recommended to you

Latest news