ఆ ముగ్గురూ బెస్టే… కానీ కోహ్లి ఫిట్నెస్, యాటిట్యూడ్ ఇష్టం : జైశంకర్

-

కింగ్ విరాట్ కోహ్లీ పైన విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రశంసల వర్షం కురిపించారు.రన్ మెషీన్ విరాట్ కోహ్లి అంటే తనకెంతో ఇష్టమని కేంద్ర మంత్రి జైశంకర్ తెలిపారు. క్రికెట్ లెజెండ్స్ కోహ్లి, సచిన్, సునీల్ గవాస్కర్లలో ఎవరంటే ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ‘ముగ్గురూ బెస్టే. కానీ కోహ్లి ఫిట్నెస్, యాటిట్యూడ్ నచ్చుతుంది. అందుకే నేను అతడిని ఎక్కువగా ఇష్టపడుతుంటా’ అని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను కోహ్లి అభిమానులు షేర్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లి 35 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. కోహ్లి ఈ వయసులోనూ భీకర ఫామ్లో ఉండటానికి అతని ఫిట్న్స్సె కారణమని ఇప్పటికే చాలామంది క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆట పట్ల అతనికున్న అంకితభావం, దృక్పదం అతన్ని లేటు వయసులోనూ టాప్ క్రికెటర్గా నిలబెడుతుంది. చాలా మంది యువ క్రికెటర్లు కూడా ఫిట్నెస్ విషయంలో, యాటిట్యూడ్ విషయంలో విరాట్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news