ఆ ఫారెస్ట్ లో జూలై 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేదం : అటవీశాఖ చీఫ్ వైల్డ్ ఆఫ్ వార్డెన్

-

అమ్రాబాద్  ఫారెస్ట్ లో జూలై 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేదం విధిస్తున్నట్టు అటవీశాఖ చీఫ్ వైల్డ్ ఆఫ్ వార్డెన్ ఈలుసింగ్ తెలిపారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ను అనుమతించబోమని, సందర్శకులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. పర్యాటకుల కోసం నీటి సమస్యలు తలెత్తకుండా వారు సందర్శించే మార్గ మధ్యలో అనుకూలమైన ప్రదేశాలలో తగిన నీటి సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సందర్శకులు తమవెంట తీసుకువచ్చే ఆహార పదార్థాల వ్యర్థాలను నిర్దేశించిన స్థలంలో ఏర్పాటు చేసిన చెత్త కుండీలలోనే వేయాలన్నారు.

జూలై 01 నుంచి ఈ నిబంధనలు వర్తిస్తాయి. అప్పటి నుంచి అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియాల్లో ప్లాస్టిక్ పూర్తిగా నిషేదం విధించనున్నట్టు వెల్లడించారు. వ్యాపారస్తులకు కూడా ప్లాస్టిక్ వస్తువులను అమ్మకూడదు.. కొనకూడదని సూచనలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఫారెస్ట్ లో ప్లాస్టిక్ వల్ల చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news